ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ గాడ్జెట్స్‌‌‌‌

ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ గాడ్జెట్స్‌‌‌‌

కరోనా వల్ల చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. పోషకాల ఫుడ్‌‌‌‌ తింటున్నారు. వర్కవుట్స్‌‌‌‌ చేస్తున్నారు. జిమ్‌‌‌‌లకు వెళ్లేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. కొందరైతే ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌‌‌‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టు కొన్ని కంపెనీలు ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఉండే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ గాడ్జెట్స్‌‌‌‌ అమ్ముతున్నాయి. వాటిలో కొన్ని..  

వేయింగ్ స్కేల్‌‌‌‌

వెయిట్‌‌‌‌ తగ్గాలనుకునే వాళ్లు.. ‘‘రోజూ జిమ్‌‌‌‌ చేస్తున్నాం కదా చాల్లే” అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎప్పటికప్పుడు బరువు చెక్‌‌‌‌ చేసుకుంటూ.. కొత్త గోల్స్‌‌‌‌ పెట్టుకోవాలి. అందుకోసం ఇలాంటి స్మార్ట్ వేయింగ్‌‌‌‌ స్కేల్‌‌‌‌ వాడాలి. బీట్ ఎక్స్‌‌‌‌పీ కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తెచ్చిన ఈ వేయింగ్‌‌‌‌ స్కేల్‌‌‌‌ బీఎంఐ(బాడీ మాస్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌)ని కూడా కాలిక్యులేట్‌‌‌‌ చేస్తుంది. ఇందులో ఉండే సెన్సర్లు ఫ్యాట్‌‌‌‌తోపాటు బాడీ వాటర్ పర్సంటేజ్‌‌‌‌, మెటబాలిక్‌‌‌‌ రేట్‌‌‌‌ లాంటి 24 పారామీటర్స్‌‌‌‌ని అంచనా వేస్తాయి. దీన్ని బ్లూటూత్‌‌‌‌తో మొబైల్‌‌‌‌కి కనెక్ట్‌‌‌‌ చేసి వాడుకోవచ్చు. యాపిల్‌‌‌‌ హెల్త్‌‌‌‌, గూగుల్‌‌‌‌ ఫిట్‌‌‌‌,  ఫిట్‌‌‌‌బిట్‌‌‌‌, శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ యాప్‌‌‌‌లతో డేటాని సింక్ చేసుకోవచ్చు. ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్‌‌‌‌లో వెయిట్‌‌‌‌తోపాటు ఫ్యాట్‌‌‌‌, బీఎంఐలాంటి ఆరు పారామీటర్స్ స్ర్కీన్​ మీద కనిపిస్తాయి. ఇందులో రీచార్జబుల్‌‌‌‌ బ్యాటరీలు ఉంటాయి. ధర: 3,699 రూపాయలు
పల్స్‌‌‌‌ వైబ్రేటింగ్‌‌‌‌ రోలర్‌‌‌‌‌‌‌‌
వర్కవుట్లు చేసిన వెంటనే చాలామందికి కండరాలు పట్టేస్తాయి. అప్పుడు మసాజ్‌‌‌‌, స్ట్రెచెస్‌‌‌‌ చేయాలి. లేదంటే కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని ఎవరికివాళ్లు మసాజ్ చేసుకోవడం కష్టం. ఇలాంటి వైబ్రేటింగ్ ఫోమ్‌‌‌‌ రోలర్స్‌‌‌‌ వాడితే అదే మసాజ్‌‌‌‌ చేసేస్తుంది. ఇది కండరాలు, కనెక్టివ్‌‌‌‌ టిష్యూస్‌‌‌‌ స్ట్రెయిన్ అవ్వకుండా చేస్తుంది. భారీ బరువులు ఎత్తినప్పుడు కూడా దీంతో మసాజ్‌‌‌‌ చేసుకుంటే బాడీ పెయిన్స్‌‌‌‌ నుంచి తప్పించుకోవచ్చు. లిథియం అయాన్‌‌‌‌ బ్యాటరీతో నడిచే దీన్ని ఫుల్ ఛార్జ్‌‌‌‌ చేస్తే పది గంటలు పనిచేస్తుంది. ఇందులో ఎనిమిది స్పీడ్‌‌‌‌ సెట్టింగ్స్ ఉన్నాయి. ధర: 17,951 రూపాయలు

స్కిప్పింగ్ రోప్

బెల్లీ ఫ్యాట్‌‌‌‌ కరిగించుకోవడానికి ఎక్కువమంది స్కిప్పింగ్ చేస్తుంటారు. కొందరైతే టార్గెట్​ పెట్టుకుని రోజూ కొన్ని రౌండ్స్‌‌‌‌ పెంచుతుంటారు. కానీ.. రోజూ జంప్స్ లెక్కపెట్టుకోవడం కష్టమే. ఈ తన్‌‌‌‌గ్రమ్‌‌‌‌ స్మార్ట్ రోప్‌‌‌‌తో స్కిప్పింగ్‌‌‌‌ చేస్తే లెక్కపెట్టుకోవాల్సిన శ్రమ ఉండదు. దీనికి 23 ఎల్‌‌‌‌ఈడీ లైట్లు ఉంటాయి. రోప్‌‌‌‌లో మ్యాగ్నెటిక్ సెన్సర్లు కూడా ఉంటాయి. ఇది ఎన్ని జంప్‌‌‌‌లు చేశారనేదే కాకుండా ఎన్ని క్యాలరీలు బర్న్‌‌‌‌ అయ్యాయనేది కూడా మానిటర్ చేస్తుంది. మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌ చేసి ఆ డేటాను తెలుసుకోవచ్చు. కాకపోతే దీని ధర కాస్త ఎక్కువ. అయితే.. కేవలం ఎన్ని జంప్‌‌‌‌లు చేశామనేది ట్రాక్‌‌‌‌ చేస్తే చాలనుకుంటే.. సెర్వ్యూట్టమ్‌‌‌‌ స్కిప్పింగ్‌‌‌‌ రోప్‌‌‌‌ తీసుకోవచ్చు. క్వాలిటీ ఫీచర్స్‌‌‌‌ బట్టి అనేక ధరల్లో స్కిప్పింగ్‌‌‌‌ రోప్‌‌‌‌లు దొరుకుతున్నాయి. స్మార్ట్​ స్కిప్పింగ్​ రోప్​ : 12,000 రూపాయలు, కౌంటింగ్​ రోప్​ : 325 రూపాయలు

జాక్స్​జాక్స్‌‌‌‌ కెటిల్‌‌‌‌బెల్‌‌‌‌ కనెక్ట్

ఇంట్లో ఎక్కువమంది జిమ్‌‌‌‌ చేసేవాళ్లుంటే ఈ ‘‘జాక్స్​జాక్స్‌‌‌‌ కెటిల్‌‌‌‌బెల్‌‌‌‌ కనెక్ట్‌‌‌‌’’ బెస్ట్ చాయిస్‌‌‌‌. వెయిట్స్‌‌‌‌ ఎత్తేవాళ్లు ఒక్కొక్కరు ఒక్కో బరువుండే కెటిల్‌‌‌‌బెల్స్‌‌‌‌తో వర్కవుట్‌‌‌‌ చేస్తుంటారు. అందుకోసం అన్ని కెటిల్‌‌‌‌బెల్స్‌‌‌‌ కొనాలంటే కష్టమే. కానీ.. ఈ అడ్జస్టబుల్‌‌‌‌ కెటిల్‌‌‌‌ బెల్‌‌‌‌లోని వెయిట్‌‌‌‌ ప్లేట్స్‌‌‌‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ప్లస్‌‌‌‌ బటన్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ చేస్తే ఒక వెయిట్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ యాడ్ అవుతుంది. అలా ఎన్ని సార్లు చేస్తే అన్ని ప్లేట్స్ యాడ్‌‌‌‌ అవుతాయి. 5.5 కేజీల నుంచి 19 కేజీల వరకు కావాల్సినంత బరువు పెంచుకోవచ్చు. పైగా ఇది మామూలు వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. దీనికి ఉండే చిన్న స్క్రీన్‌‌‌‌లో వెయిట్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే అవుతుంది. మరో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఆరు మోషన్‌‌‌‌ సెన్సర్స్ ఉంటాయి. అవి ఎంత వెయిట్‌‌‌‌తో, ఎన్ని సెట్స్‌‌‌‌, ఎంత టైంలో చేశారు.. అనేది లెక్కేసి చెప్తాయి. ఫోన్‌‌‌‌ యాప్‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌ చేసుకుని వాడుకోవచ్చు. ధర: 19,968 రూపాయలు