మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్జనరల్హాస్పిటల్లో దారుణం జరిగింది. కిడ్నీ సమస్యతో ట్రీట్మెంట్ పొందుతున్న ఓ పేషెంట్‌ను పక్క బెడ్‌పై ఉన్న మరో పేషెంట్ కత్తితో పొడిచాడు. బాధితుడిని వరంగల్ఎంజీఎంకుతరలించగా చనిపోయాడు. హాస్పిటల్వర్గాలు, పోలీసులు ఈ ఘటనను దాచిపెట్టగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య(52) కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా ఈ నెల 7న కుటుంబసభ్యులు మంచిర్యాల జీజీహెచ్‌లో అడ్మిట్ చేశారు. మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఫిట్స్ పేషెంట్ సుధాకర్ఈ నెల10న హాస్పిటల్‌కు రాగా, అతడికి దేవయ్య పక్క బెడ్ ను కేటాయించారు.
11న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సైకోగా మారిన సుధాకర్ బెడ్ పై పడుకున్న దేవయ్యపై కత్తితో దాడి చేశాడు. ఛాతి, కడుపుపై పొడిచి పారిపోయాడు. దేవయ్య వెంట ఉన్న భార్య తన కొడుకు రాముకు విషయం చెప్పగా అతడు వచ్చి తండ్రికి ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ చేయిం చాడు. కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పడంతో వెంటనే హాస్పిటల్‌కు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. దీంతో వారు ఇక్కడ సరైన వసతులు లేవని, వరంగల్ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారన్నాడు. ఘటన తెల్లవారుజామున 3గంటలకు జరిగితే సాయంత్రం 4 గంటలకు దేవయ్యను ఎంజీఎంకు తరలించారు. రాము ఫిర్యాదు మేరకు సుధాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్మంచిర్యాలలో లేబర్ పనిచేస్తున్నాడని, మద్యానికి బానిసై ఫిట్స్బారినపడి హాస్పిటల్‌కు రావడంతో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్అందించామని, ఇలా చేస్తాడని ఊహించలేదని సూపరింటెండెంట్హరిశ్చంద్రారెడ్డి చెప్పారు. సైకోగా మారిన సుధాకర్ హాస్పిటల్‌కు వచ్చేటప్పుడే వెంట కత్తి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. సిబ్బంది గమనించకపోవడంతో ఈ దారుణం జరిగింది
