రాష్ట్రంలో సర్కార్ డాక్టర్ల కు అడ్మిని స్ట్రేషన్ క్లాసులు

రాష్ట్రంలో సర్కార్ డాక్టర్ల కు అడ్మిని స్ట్రేషన్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆధ్వర్యంలో హాస్పిటల్స్ డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు ఐదు రోజుల పాటు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌‌హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ వేదికగా క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఐదు రోజుల ట్రైనింగ్‌లో హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లు, సిబ్బందితో ఎలా మాట్లాడాలి? నెగోషియేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి? తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్, కండక్ట్ రూల్స్ 1991పై చర్చిస్తారు. 

అలాగే ట్రైనింగ్‌లో మెడికల్ కాలేజీల్లో ఫైనాన్స్‌, ఆడిటింగ్‌ తలనొప్పులు రాకుండా ఎలా చూసుకోవాలి? లీగల్ ఇష్యూస్‌ను ఎలా డీల్ చేయాలి, డిజిటల్ మార్పులు, ఏఐ టెక్నాలజీ వాడకం, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై, ఫైల్స్ నోటింగ్, డ్రాఫ్టింగ్ ఎలా ఉండాలనే దానిపైనా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. చివరి రోజు హెచ్ఆర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి? ఎమర్జెన్సీ ప్లానింగ్ ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తారు.