గిన్నిస్ రికార్డు కోసం టాయిలెట్​పై ఐదు రోజులు

గిన్నిస్ రికార్డు కోసం టాయిలెట్​పై ఐదు రోజులు

జహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..’ అనుకున్నాడో ఏమో!! ఇదిగో ఈ పెద్దమనిషి.. ఓ వింత పని చేశాడు. గిన్నిస్ రికార్డు కోసం ఏకంగా ఐదు రోజులు టాయిలెట్​ కమోడ్‌పై కూర్చున్నాడు. బెల్జియం దేశానికి చెందిన జిమ్మీ డీ ఫ్రెన్నె (48) ఓ బస్సు డ్రైవర్. 165 గంటలపాటు టాయిలెట్​పై కూర్చుని గిన్నిస్ రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. ఇతని ప్రయత్నం కోసం ఓస్టెండ్​సిటీలోని ఫిలిప్ ప్లేస్ బార్​లో మధ్యలో ఓ టాయిలెట్​ను ఏర్పాటు చేశారు. ప్రతి గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకున్నాడు. ‘‘చూడ్డానికి బాగానే ఉన్నా.. అలా కూర్చోవడం చాలా కష్టం. నా కాళ్లు వాచిపోయాయి.

చివరికి నేను గెలిచాను” అని జిమ్మీ అన్నాడు. టాయిలెట్​పై కూర్చోవడానికి సంబంధించి ఎలాంటి వరల్డ్ రికార్డు లేదు. అయితే జిమ్మీ మాత్రం.. గతంలో ఎవరో 100 గంటలపాటు కూర్చున్నాడని చెబుతున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తన అటెంప్ట్ గురించి తెలుసని, లోకల్ అధికారులు చూశారని చెప్పాడు. ముందుగా 165 గంటలపాటు కూర్చోవాలని భావించిన జిమ్మీ.. 116 గంటలకే చాలించాడట. గంట, రెండు గంటలు కూర్చోవాలంటేనే మనం తెగ కష్టపడిపోతాం.. అలాంటిది ఐదురోజులంటే తమాషలా. వామ్మో!!