IND vs ENG: టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే లక్కీ ఛాన్స్.. ఐదుగురు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు గాయాలు

IND vs ENG: టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే లక్కీ ఛాన్స్.. ఐదుగురు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు గాయాలు

టీమిండియాతో ఐదు టెస్ట్ ల సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టును వరుస గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ కు మరో 20 రోజుల ముందు ఫాస్ట్ బౌలర్ల గాయాలు ఇంగ్లాండ్ జట్టును ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తం ఐదుగురు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నారు. ఇప్పటికే గాయంతో ఈ మెగా సిరీస్ కు స్టార్ పేసర్ మార్క్ వుడ్, ఓలి స్టోన్ మోకాలి గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా ఆ లిస్టులో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జామీ ఓవర్టన్ ఈ లిస్ట్ లో చేరాడు.

మోకాలి గాయం కారణంగా స్టోన్ సర్జరీ చేయించుకోవడంతో ఈ ఇంగ్లాండ్ పేసర్ కు 14 వారల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఇండియాతో జరగనున్న సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నాటింగ్‌హామ్‌షైర్ ప్రీ-సీజన్ పర్యటనలో స్టోన్‌ కుడి మోకాలికి గాయం అయింది. ఆ తర్వాత స్కానింగ్ లు నిర్వహించగా.. అతనికి సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. ఇంగ్లాండ్ వేదికగా 2024లో శ్రీలంకతో రెండు టెస్టుల్లో స్టోన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 

ALSO READ | IPL 2025: ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న బెంగళూరు జట్టు.. స్టార్ ప్లేయర్ ఫుల్ ఫిట్

ఐపీఎల్ తర్వాత ఆర్చర్ కు గాయం తిరగబెట్టింది. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు ముందు ఆర్చర్‌‌‌‌‌‌‌‌.. కుడి చేతి బొటన వేలి గాయంతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. దీంతో ఆర్చర్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ల్యూక్‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. రాబోయే వారం రోజుల్లో పేసర్‌‌‌‌‌‌‌‌ గాయాన్ని అంచనా వేసి తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడనే అంశంపై ఈసీబీ క్లారిటీ ఇవ్వనుంది. భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ సమయానికి ఆర్చర్ కోలుకోవడం అనుమానం గానే ఉంది. 

ఇంగ్లాండ్ రైజింగ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల నొప్పి కారణంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా అతనికి గాయం అయింది. టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అట్కిన్సన్ ఫిట్ గా ఉంటాడా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇంగ్లాండ్ మరో ఫాస్ట్ బౌలర్ జామీ ఓవర్టన్ వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో చేతి వేలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఓవర్టన్ రెండో బంతికే క్యాచ్ పట్టే క్రమంలో గాయపడ్డాడు. దీంతో ఈ 31 ఏళ్ల పేసర్ నొప్పితో డ్రెస్సింగ్ రూమ్‌కు పరిగెత్తాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wisden (@wisden_cricket)