IPL 2025: ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న బెంగళూరు జట్టు.. స్టార్ ప్లేయర్ ఫుల్ ఫిట్

IPL 2025: ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న బెంగళూరు జట్టు.. స్టార్ ప్లేయర్ ఫుల్ ఫిట్

ఐపీఎల్ 2025 ఫైనల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం (జూన్ 1) అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం. ఐపీఎల్ 2025 ఫైనల్ మంగళవారం (జూన్ 3) జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.  క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి దర్జాగా ఐపీఎల్‌ ఫైనల్ చేరిన రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు (ఆర్సీబీ) తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ వేటలో తనకు సవాల్ విసరబోయే ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తోంది.     

ALSO READ | IPL 2025: ఈ సారి IPL టైటిల్ ఆ జట్టుదే.. టోర్నీ విజేత ఎవరో జోస్యం చెప్పిన వార్నర్..!

ఐపీఎల్ 2025 లో ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 2 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీ జట్టుతో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించటానికి అడుగు దూరంలో ఉన్న బెంగళూరు జట్టు ఈ సారి ఫైనల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. 2009, 2011, 2106 లో ఫైనల్ వరకు వచ్చిన ఆర్సీబీ మూడు సార్లు ఓడిపోయి రన్నరప్ తో సరి పెట్టుకుంది. 

ALSO READ | IND A vs ENG Lions: కోహ్లీ '18' నెంబర్ జెర్సీ ధరించిన ముఖేష్.. బీసీసీఐ‌పై నెటిజన్స్ ఆగ్రహం

గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన టిమ్ డేవిడ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నట్టు సమాచారం. ఫైనల్లో డేవిడ్ లివింగ్ స్టోన్ స్థానంలో ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఆర్సీబీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ రజత్ పటిదార్ ఫామ్ లోకి వస్తే బెంగళూరు జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో అత్యంత దుర్బేధ్యంగా కనిపిస్తుంది. భువనేశ్వర్, హేజల్ వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్ ఫైనల్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు