హాష్ ఆయిల్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్‌‌

హాష్ ఆయిల్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హాష్ ఆయిల్ సప్లయర్లు ఐదుగురిని వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.  అత్తాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ముల్కల భానుప్రకాశ్(25) పంజాగుట్టలోని ఓ  సంస్థలో టెలీకాలర్​గా పనిచేస్తున్నాడు. జల్సాలకు బానిసై గంజాయికి అలవాటుపడ్డాడు. నర్సింహా అనే గంజాయి పెడ్లర్‌‌‌‌‌‌‌‌తో కలిసి భాను ప్రకాశ్​  ఆసిఫ్‌‌‌‌నగర్ పోలీసులకు దొరికి జైలుకెళ్లాడు. బయటికి వచ్చాక బోయిన్‌‌‌‌పల్లికి చెందిన విష్ణుతో  కలిసి గంజాయి నుంచి తీసిన హాష్‌‌‌‌ ఆయిల్​ను సప్లయ్ చేయడం ప్రారంభించాడు. వారం కిందట విష్ణు వద్ద హాష్‌‌‌‌ ఆయిల్ కొన్నాడు. మెహిదీపట్నంలో అమ్మేందుకు ప్లాన్ చేశాడు. సౌత్​జోన్​ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు భానుప్రకాశ్​పై నిఘా పెట్టి శనివారం అరెస్ట్ చేశారు. 450 ఎంఎల్‌‌‌‌ హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ సీసాలు, బైక్‌‌‌‌ను సీజ్ చేశారు.

నిజాంపేటలో మరో ముగ్గురు 

మూసాపేట: హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురిని బాలానగర్ ఎస్​వోటీ, బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం.. సూరారంలో ఉండే బుద్రాజ్ యుటేశ్​వర్మ, మామిడి వెంకట హరికృష్ణ, గాంధీనగర్​లో ఉండే సయ్యద్ ఇమ్రాన్ ప్రైవేటు జాబర్స్.  జల్సాలకు బానిసై ఈజీమనీ సంపాదనకు హాష్ ఆయిల్ అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఏపీలోని పాడేరు, వైజాగ్ నుంచి తెప్పించి సిటీలోని  వివిధప్రాంతాల్లో అమ్మడం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు బాచుపల్లిలోని నిజాంపేట క్రాస్ రోడ్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యుటేశ్, హరికృష్ణ, ఇమ్రాన్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 230 హాష్ ఆయిల్ సీసాలు, ఒక  కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  బోరబండ రాజీవ్ గాంధీనగర్​లో ఉండే నరమ్ నాథ్​ ప్రవీణ్ కుమార్  సనత్​నగర్​లోని బల్దియా గ్రౌండ్​లో హాష్ ఆయిల్ అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.70 సీసాలను స్వాధీనం చేసుకున్నారు.