రైళ్లు నడపడానికి 5 లక్షల మంది లేడీస్​ పోటీ

రైళ్లు నడపడానికి  5 లక్షల మంది లేడీస్​ పోటీ

ఇండియన్ రైల్వేలో డ్రైవర్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ ఉద్యోగాల కోసం దాదాపు ఐదు లక్షల మంది ఆడాళ్లు పోటీ పడుతున్నారు. మగాళ్లు ఎక్కువగా పని చేస్తున్న ఈ ఏరియాల్లో జాబ్స్ కోసం ఆడాళ్లు పోటీ పడటం శుభసూచకమని రైల్వే పెద్దాఫీసర్లు అంటున్నారు. 98 మంది ట్రాన్స్ జెండర్లు కూడా లోకో పైలట్, టెక్నీషియన్ జాబ్స్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్ లో ఉందని వెల్లడించారు.

27,795 అసిస్టెంట్ లోకో పైలట్లు(ఏఎల్పీ), 36,576 టెక్నిషియన్ ఉద్యోగాలకు రైల్వే ఇటీవల నోటిఫికేషన్ వేసింది. దీనికి రైల్వే రాత పరీక్షను కూడా నిర్వహించింది. త్వరలో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వీటి కోసం 42.82 లక్షల మంది మగాళ్లు, 4.75 లక్షల మంది మహిళలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బిహార్ నుంచి అత్యధికంగా 72,817 మంది, నాగాలాండ్ నుంచి అతి తక్కువగా 11 మంది ఆడాళ్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ నుంచి ఒకే ఒక్క మహిళ అప్లై చేశారని చెప్పారు.