యువతిని చేయిపట్టి లాగి అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు నేపాలీ యువకులకు జైలు శిక్షపడింది. ఈ కేసులో ఐదుగురు నేపాలి యవకులను దోషులుగా తేల్చిన కోర్టు ఏడు రోజుల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.
గురువారం (మే28) హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తున్న యువతి చేయి పట్టి లాగి, అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను స్థానికులు అడ్డుకున్నారు. యువతి కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ అనే నేపాలీ యువకులను నిర్బంధించి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
