గిన్నెలు మాడితే స్క్రబ్బర్తో రప్పా.. రప్పా.. రుద్దడం కాదు.. సింపుల్గా ఇలా చేయండి చాలు !

గిన్నెలు మాడితే స్క్రబ్బర్తో రప్పా.. రప్పా.. రుద్దడం కాదు.. సింపుల్గా ఇలా చేయండి చాలు !

పాలు పొంగడం.. అన్నం, కూరలు అడుగంటడం ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ, కొన్నిసార్లు అన్నం కూరలతో పాటు గిన్నెలు కూడా మాడి, మసైపోతాయి. అంతమాత్రాన ఆ గిన్నెల్ని పక్కనపెట్టాల్సిన పనిలేదు. మాడిపోయిన గిన్నెలో మూడొంతుల నీళ్లు పోయాలి. అందులో ఒక టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు కప్పుల వెనిగర్ లేదా నిమ్మరసం వేసి మరోసారి కలపాలి.

స్టవ్ మంటను హైలో పెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత మంట తగ్గించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే గరిటెతో గిన్నె లోపల మాడిన దాన్ని గీరాలి. ఇప్పుడు ఆ నీళ్లని గిన్నె బయటివైపు పోయాలి. ఐదు నిమిషాల తర్వాత స్క్రబర్ తో గిన్నెను రుద్దితే మసి పోతుంది. అలాగే గిన్నె మాడినప్పుడు వంట గదంతా కూడా మాడు వాసన వస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లతో గది తుడిస్తే ఆ వాసన పోతుంది.

స్టవ్ మీద గిన్నె పెట్టి.. ఇంకో పనిలో పడిపోతే.. వంటిల్లో వంట పరిస్థితి ఏంటి? ఒక్కోసారి వంటంతా పాడైపోతుంది. ఒక్కోసారి పెనం మాడిపోతుంది. అలా మాడిన పెనంను క్లీన్ చేయడం పెద్ద పని. ఆ పని ఈజీగా అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

పెనం మాడిపోతే..
* మాడిన పెనంలో నీళ్లు పోసి మరిగించాలి.
* ఇలా చేస్తే మాడిన పెనం భాగం మెత్తగ అవుతుంది.
*అప్పుడు రుద్దితే మాడింది వదిలిపోతుంది.
* ఉప్పుతో ఏ వస్తువు అయినా క్లీన్ చేయొచ్చు.
* మాడిన పెనాన్ని క్లీన్ చేసేటప్పుడు గిన్నెలు తోమే సబ్బుతో ఉప్పు కలిపి రుద్దాలి.
* అవసరం అయితే దాంట్లో నిమ్మరసం కూడా కలపొచ్చు.
* బట్టలు ఉతకడానికి వాడే బేకింగ్ సోడాతో రుద్దినా ఫలితం ఉంటుంది. 
* వేడి చేసిన నీళ్లలో బేకింగ్ సోడా కలిపి.. పెనంలో వేసి రుద్దాలి. 
* అవసరమైతే ఇంకా బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు.
* తర్వాత రుద్ది నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.