
కొత్త ఏడాదిలో యూజర్లకి కొత్త అప్డేట్స్ అందిస్తోంది టెలిగ్రామ్. మెసేజ్‌లకు ఎమోజీలతో రిప్లై ఇచ్చే ఫీచర్ తెచ్చేసింది.ఇప్పటివరకు ఐఫోన్ ఐ మెసేజెస్, ఫేస్బుక్ మెసెంజర్లో మాత్రమే ఇలాంటి ఫీచర్ ఉంది. దీంతో యానిమేటెడ్, ఇంటరాక్టివ్ ఎమోజీ ఫీచర్లు అందిస్తున్న మొదటి మెసేజింగ్ యాప్‌గా టెలిగ్రామ్ నిలవనుంది. అంతేకాదు ‘స్పాయిలర్’, ‘మెసేజ్ ట్రాన్స్లేషన్’ అనే రెండు కొత్త ఫీచర్లు కూడా తీసుకొచ్చింది. మెసేజ్లోని టెక్స్ట్కనిపించకుండా ఉండేందుకు ‘స్పాయిలర్’ ఫీచర్ పనికొస్తుంది. సెన్సిటివ్ విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు అవతలివాళ్లకు ఇబ్బంది లేకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మెసేజ్ ట్రాన్స్లేషన్ కోసం సెట్టింగ్స్‌లో లాంగ్వేజ్‌ని ఎంచుకుంటే సరిపోతుంది.