
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా మరో ఐదుగురు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 67కు చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరు హై రిస్క్ కంట్రీ నుంచి.. మిగిలిన నలుగురు నాన్ రిస్క్ కంట్రీల నుంచి వచ్చారు. మరో 20 శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ కొత్తగా 280 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. 206 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.