రాత్రి నిద్ర రావడం లేదా..? ఇలా చేయండి

రాత్రి నిద్ర రావడం లేదా..? ఇలా చేయండి

రోజు బిజీ బిజీగా గడిపే అందరికి నిద్ర అత్యంత అవసరం. నిద్ర మానసిక, శారీరక శ్రమ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు నిద్రపోవడం చాలా అవసరం. రోజువారీ పనులని చక్కగా చేయడానికి.. వ్యాధులని దూరంగా ఉంచడానికి ప్రతిరోజు తగినంత నిద్ర అవసరం. రాత్రి 7- నుంచి 8 గంటల నిద్ర రోజంతా అలసటను దూరం చేస్తుంది. అయితే చాలా మంది రాత్రి నిద్రించడానికి ఇబ్బందులు పడుతుంటారు. కొంత మందికి అర్థరాత్రి వరకు నిద్ర రాదు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మనసుకు..శరీరానికి విశ్రాంతి లభించక మరుసటి రోజు అలసట, నీరసంగా కనిపిస్తారు. అయితే అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం ప్రతీ ముగ్గురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో మంచి రాత్రి నిద్రను ప్రేరేపించడానికి  ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే ఔషధాలతో రాత్రి పూట హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు. 

జీరా (జీలకర్ర విత్తనాలు):

జీరా ప్రతీ వంటగదిలో అత్యంత ప్రభావవంతమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, జీవక్రియను పెంచడానికి, యాసిడ్ రిఫ్లక్స్ నిరోధించడానికి సహాయపడుతుంది. అంతే కాదు జీరా నిద్రకు కూడా సహాయపడుతుంది.  జీరాలో  ప్రశాంతను అందించే గుణాలున్నాయని చెబుతుంటారు.  ఇది ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుందంటున్నారు. - రాత్రి  జీరా టీని తాగితే బాగా నిద్రించే అవకాశం ఉందని చెప్తున్నారు. 

జైఫాల్ (జాజికాయ):

జాజికాయ శరీరానికి మత్తుమందుగా పనిచేస్తుంది.  ఇది నరాలను శాంతపరచడానికి సహాయపడుతుంది. ఒత్తిడి కలిగిన శరీరానికి ఉపశమనాన్ని అందజేస్తుంది. జాజికాయ నిద్రను సమర్థవంతంగా ప్రేరేపించడంతో పాటు..నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. హల్ది డౌధ్‌లో చిటికెడు జాజికాయను జోడించి త్రాగితే రాత్రి పూట హాయిగా నిద్రపోవచ్చు. 

పుదీనా (పుదీనా ఆకులు):

పుదీనా ప్రశాంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. పుదీనా ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పుదీనాలో ఉన్న మెంతోల్ కండరాలను శాంతించడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు పుదీనా టీని తాగితే యు మంచి రాత్రి నిద్రను ఆస్వాదించొచ్చు. 

సోంపు: 

సోంపు కండరాలను  సడలించడానికి సహాయపడే ప్రశాంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది మంచి నిద్రను దోహదపడుతుంది.  అందువల్ల నిపుణులు తరచూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు సోంపు నీరు తాగాలని సూచిస్తున్నారు.

అశ్వగంధ: 

మన దేశంలో అశ్వగంధ ప్రాచీన కాలం నుండి సాంప్రదాయ వైద్య సాధనలో ఒక భాగం. దీనిని అడాప్టోజెనిక్ హెర్బ్ అని పిలుస్తారు. ఇది శరీరంలోని ఒత్తిడి, ఆందోళనతో పోరాడుతుంది. అంతేకాకుండా  అశ్వగంధ యొక్క మూలాలు మొత్తం రోగనిరోధక శక్తి, బలం,శక్తికి సహాయపడతాయి. ఒక గ్లాసు చంద్ర పాలు (అశ్వగంధ పాలు) రోజూ పడుకునే ముందు తాగితే సుఖవంతమైన నిద్రను ఆస్వాదించవచ్చు.