ఘట్కేసర్, వెలుగు: ‘అసలు నువ్వు మనిషివేనా..నీ ఇంట్లో చెత్తను ప్లాస్టిక్ కవర్లలో ఇలా రోడ్డు పక్కన పడేస్తున్న నువ్వు మూర్ఖుడివి కాదా’ అంటూ ఘట్కేసర్ మున్సిపాలిటీలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఘట్కేసర్ పరిధిలోని రోడ్లపై చెత్త వేస్తుండడంతో వారిని కట్టడి చేయడానికి స్ఫూర్తి ఆర్గనైజేషన్ కార్యకర్త యాదిగిరి వినూత్నంగా ఆలోచించాడు.
‘రోడ్లపై చెత్త వేసి పరిసరాలను పాడు చేయడంతో పాటు అంటు వ్యాధులకు కారణమవుతున్న నువ్వు శిక్షార్హుడివి’ అంటూ ఫ్లెక్సీలు పెడుతున్నాడు. దీంతో అందరూ ఈ ఫ్లెక్సీల గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
