ఫ్లెక్సీలు కలకలం : సింధియా AICC అధ్యక్షుడు కావాలట

ఫ్లెక్సీలు కలకలం : సింధియా AICC అధ్యక్షుడు కావాలట

కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా AICC అధ్యక్షుడు కావాలంటూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. భోపాల్ లోని కాంగ్రెస్ ఆఫీస్ ముందు కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా జ్యోతిరాదిత్యను నియమించాలని రాహుల్ గాంధీ కోరుతూ ఫ్లెక్సీలు పెట్టారు. జ్యోతిరాదిత్య సమర్థవంతంగా పనిచేయగలడని… అందుకే ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలని రాహుల్ గాంధీని కోరారు.