టీఆర్ఎస్ లో ఫ్లెక్సీ వార్ ..ఎమ్మెల్యే vs సర్పంచ్

టీఆర్ఎస్ లో ఫ్లెక్సీ వార్ ..ఎమ్మెల్యే vs సర్పంచ్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. టీఆర్ఎస్ పార్టీలో ఫ్లెక్సిల గురించి వర్గ విభేదాలు తలెత్తాయి. నిన్న చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహా ఆవిష్కరణ కోసం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జీహెచ్ఎంసీ ఇవాళ ఫ్లెక్సీలు తొలగిస్తుండగా వివాదం జరిగింది. నీలం మధు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు.  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని ఆరోపించారు.