
- ప్రభుత్వ నియామక పరీక్షల్లో కాపీ కొట్టడం కోసం బెంగళూరు వెళ్తూ..
- సీఐఎస్ఎఫ్ అధికారులకు పట్టుబడ్డ నిందితుడు
శంషాబాద్, వెలుగు: నకిలీ ధ్రువపత్రాలతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని శంషాబాద్ఎయిర్పోర్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ నెల 8న హర్యానాకు చెందిన అమిత్ కుమార్ ఆగ్రా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. బెంగళూరు వెళ్లే విమానం ఎక్కేందుకు వెళ్తూ సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించాడు.
తనిఖీ చేయగా ప్రభుత్వ నియామక పరీక్షల్లో మోసం చేసేందుకు ఉపయోగించే బ్లూటూత్ లు, కాపీ అయిన ఆధార్ కార్డులు, వివిధ పాఠశాలల సర్టిఫికెట్లు, జింద్ కాలేజీకి సంబంధించిన రబ్బర్ స్టాంప్‌లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అమిత్ కుమార్ అవకాశ్పేరుతో టికెట్లు బుక్ చేసుకున్నాడని, బెంగళూరులో జరగనున్న ప్రభుత్వ నియామక పరీక్షల్లో కాపీ కొట్టేందుకు సాయపడడంలో భాగంగా అక్కడికి వెళ్తున్నట్లు విచారణలో తేల్చారు.
అనంతరం అతన్ని అరెస్ట్‌చేసి, ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. అమిత్ కుమార్ కు జడ్జి14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకొని, ఇందులో ఎవరెవరి పాత్ర ఉండనే విషయమై విచారణ జరుపుతామని సీఐ పేర్కొన్నారు.