ప్రమాదానికి గురైన ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ప్రమాదానికి గురైన ఆండ్రూ ఫ్లింటాఫ్‌

ఇంగ్లాండ్ మాజీ క్రికటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ప్రమాదానికి గురయ్యాడు. టాప్ గేర్ అనే షో కోసం షూటింగ్ చేస్తుండగా ఫ్లింటాఫ్  కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లింటాఫ్  బీబీసీకి చెందిన ఒక డ్రాగ్ రేస్ కార్యక్రయానికి కో హోస్ట్ గా ఉన్నాడు. సర్రేలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  క్రూ మెడిక్స్ వెంటనే రంగంలోకి దిగి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం  ఆస్పత్రికి తరలించారు. 

గతంలోనూ..

టాప్ గేర్ రేసింగ్లో అడుగు పెట్టిన తర్వాత ఫ్లింటాఫ్‌ అనేక సార్లు ప్రమాదానికి గురయ్యాడు. 2019లోనూ ఇలాంటి తరహ ఘటన జరిగింది. ఆ సమయంలో గంటకు 125 మైళ్ల వేగంతో వాహనాన్ని నడుపుతుండగా ఫ్లింటాఫ్ కారు  అదుపుతప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

ఫ్లింటాఫ్ కెరీర్..

2009లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫ్లింటాఫ్..ఇంగ్లండ్ తరఫున 79 టెస్టుల్లో 3845 పరుగులు సాధించాడు. 226 వికెట్లు పడగొట్టాడు. 141 వన్డేల్లో 3394 పరుగులు చేసి 169 వికెట్లు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం డ్రాగ్ రేస్‌లో హోస్ట్‌గా చేస్తున్నాడు.