ఎఫ్ఎల్ఎన్తో స్టూడెంట్ల సామర్థ్యం పెరుగుతది : విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

ఎఫ్ఎల్ఎన్తో స్టూడెంట్ల సామర్థ్యం పెరుగుతది : విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
  •     టీసాట్ ప్యానెల్ చర్చలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా

హైదరాబాద్, వెలుగు: ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీతో విద్యార్థుల సామర్థ్యాలు పెరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. టీచర్లు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) గైడ్​లైన్స్, అసెస్మెంట్ విధానాలపై పూర్తి అవగాహన పొందాలని, దానిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్​తో కలిసి టీసాట్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్యానెల్ చర్చలో ఆమె పాల్గొన్నారు. ప్రైమరీ స్టేజ్​లో ఫోనిక్స్ సౌండ్స్​ ఆధారంగా పదాలు చదివే నైపుణ్యం నేర్పించడం టీచర్లకు అత్యంత కీలకమని, స్టూడెంట్ల లెర్నింగ్​ స్థాయిలను గుర్తించేందకు మాక్​టెస్టులు, టీచర్ సపోర్టెడ్ గ్రూపుల ద్వారా శిక్షణనివ్వాలన్నారు. విద్యార్థుల చదివే కెపాసిటీని పెంచేలా టైమర్​ వినయోగించాలన్నారు. నిర్ణీత సమయంలో చదివే పదాల సంఖ్య, పేరా చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సామర్థ్యాలను పెంచాలన్నారు. 

ఎఫ్ఎల్ఎన్ ఒక కార్యక్రమం కాదని, అదొక ఉద్యమమని చెప్పారు. విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేలా ఇది దోహదపడుతుందన్నారు. ఐదు రోజులు టీచింగ్, ఒకరోజు వర్క్ బుక్ (5+1) ఎడ్యుకేఉషన్ ద్వారా విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాలను ఎఫ్ఎల్ఎన్ ద్వారా పెంపొందించొచ్చని నవీన్ నికోలస్ పేర్కొన్నారు. మూడో తరగతి విద్యార్థుల కోసం రూపొందించి ఐటెం బ్యాంక్​ను టీచర్లు వినియోగించుకోవాలన్నారు.