తేలిన సంగమేశ్వరుడి గోపురం

తేలిన సంగమేశ్వరుడి గోపురం

శ్రీశైలం, వెలుగు : ప్రతి ఏడాది ఆరు నెలలు కృష్ణమ్మ ఒడిలో ఉండి, మరో 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సప్తనదుల సంగమేశ్వరుడు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ముందుగానే భక్తులకు దర్శనమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దిగువకు విడుదల చేస్తుండడంతో  రోజురోజుకూ కృష్ణా జలాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 850.90 అడు గులు కాగా, జలాశయ నీటి సామర్థ్యం 82.01టీఎంసీలుగా ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం ఖాళీ అవుతుండడంతో ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో వెలిసిన సప్త నదుల సంగమేశ్వరుడు కృష్ణమ్మను వీడి బయటకు వస్తున్నాడు.