గోదావరిలో పెరిగిన వరద పరవళ్లు

గోదావరిలో పెరిగిన వరద పరవళ్లు
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా  ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో డ్యాం వద్ద ఒక గేటు ఎత్తి నీటిని గోదావరి లోకి విడుదల ప్రారంభించారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693 అడుగుల వరకు నీరు చేరింది.  

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 12 వేల 963 క్యూ సెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి 91 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వెయ్యి 69 అడుగులకు చేరుకుంది.