శ్రీశైలానికి తగ్గిన వరద .. 882 అడుగులకు చేరిన నీటి మట్టం

శ్రీశైలానికి  తగ్గిన వరద .. 882 అడుగులకు చేరిన నీటి మట్టం

ఎగువ నుంచి వరద తగ్గుతుండటంతో శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 86వేల 211 క్యూసెక్కులుండగా.....ఔట్ ఫ్లో 2లక్షల 3వేల 523 క్యూసెక్కుల మేర కొనసాగుతోంది.  

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885  అడుగులకుగాను ప్రస్తుత నీటిమట్టం 882 అడుగుల మేర కొనసాగుతోంది. అటు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 TMCలుండగా..ప్రస్తుత నీటినిల్వ  202.96 టీఎంసీల మేర నమోదు అయింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కుడి, ఎడుమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది.