
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాయలంలోకి వరదనీరు వచ్చింది. రామాలయంతో పాటు అన్నదాన సత్రంలోకి గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆలయంలోకి నీరు చేరడం అరిష్టం అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. విస్తా కాంప్లెక్స్ దగ్గర నీటిని మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తున్న సమయంలో మోటార్ల ఫుట్‌బాల్‌లోకి ప్లాస్టిక్ కవర్లు చేరడంతో.. బ్యాక్ వాటర్ ఆలయంలోకి వచ్చి చేరిందన్నారు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.