
ఎగిరే గ్రెనేడ్లు. శత్రువులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. సర్వనాశనం చేసేయగలవు! ఒక్కసారి టార్గెట్‌ను ఎంచుకుంటే, నాలుగు చిన్ని చిన్ని రెక్కలతో గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లి శత్రు స్థావరాలపై వాలతాయి. మన దగ్గర ఉన్న రిమోట్ బటన్‌ను నొక్కితే చాలు ఆ ప్రాంతం అంతా క్షణాల్లో తునాతునకలు అవుతుంది. దీనికి ‘డ్రోన్–40’ అని పేరు పెట్టారు. గత నెలలో అమెరికాలోని ఫ్లారిడా తీరంలో సాధారణ గ్రెనేడ్ లాంచర్ నుంచి దీన్ని టెస్టు చేశారు. పెద్ద బుల్లెట్ సైజులో ఉన్న డ్రోన్–40 గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పన్నెండు నిమిషాల పాటు ఎగురుకుంటూ వెళ్లి పది కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌పై వాలింది.
ఆ తర్వాత దాన్ని పేల్చారు. మెల్ బోర్న్ కు చెందిన డిఫెండ్ టెక్స్ అనే కంపెనీ డ్రోన్–40ని తయారు చేసింది. దీన్ని మిలటరీ అవసరాలకు వాడతారా అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. వీటిని స్మోక్ గ్రెనేడ్లుగానూ, గూఢచర్యం కూడా వాడొచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఒకేసారి చాలా గ్రెనేడ్లను విసరొచ్చని చెప్పింది.