తమిళనాట డాబర్ ​ప్లాంటు .

తమిళనాట డాబర్ ​ప్లాంటు .

చెన్నై/న్యూఢిల్లీ: ఎఫ్​ఎంసీజీ కంపెనీ డాబర్​ తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో రూ.400 కోట్లతో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గురువారం తెలిపింది.  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బి రాజా సమక్షంలో ఈ మేరకు  గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. మొదటి దశ పెట్టుబడి రూ. 135 కోట్లు ఉంటుంది. 

ఐదేళ్లలో ఇది రూ. 400 కోట్లకు చేరుతుంది.  ఈ కొత్త ప్లాంట్ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి సహాయపడుతుందని,  ప్రస్తుతం తమ దేశీయ వ్యాపారంలో 18-–20 శాతం వాటా ఉంటుందని కంపెనీ తెలిపింది.   ముఖ్యమంత్రి ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే స్టాలిన్, పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బి రాజా, ముఖ్య కార్యదర్శి ఎన్ మురుగానందంతోపాటు డాబర్​ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు,  సీఈఓ మోహిత్ మల్హోత్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాంటు 250 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని డాబర్​ తెలిపింది. ఇక్కడ తేనె,  డాబర్ రెడ్ పేస్ట్,  ఓడోనిల్ వంటి ఆయుర్వేద హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, పర్సనల్ కేర్  హోమ్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తారు.