
బడి బస్సులపై ట్రాన్స్ పోర్ట్ అధికారులు నజర్ పెట్టారు. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై కొరడా ఝళిపించనున్నారు. గ్రేటర్లో ని అన్ని స్కూల్ బస్సుల ఫిట్ నెస్ కాలపరిమితి మే 15 తో పూర్తైంది. మళ్లీ రోడ్డెక్కాలంటే వాటికి ఫిట్ నెస్ తప్పనిసరి. ఇంకా దాదాపు పదివేల బస్సులు ఫిట్ నెస్ టెస్ట్ లు చేయించుకోవాల్సి ఉంది. జూన్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఆ లోపు అన్ని బస్సులు ఫిట్ నెస్ టెస్ట్ లు చేయించుకోవాలని, ఫిట్ నెస్ లేకుండా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సిటీ లోని అన్ని స్కూళ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.
డ్రైవర్లు, అటెండర్లకు అవగాహన…
జూన్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లో బస్సులు ఫిట్ నెస్ కోసం క్యూ కట్టాయి . పదిరోజుల్లోదాదాపు పదివేల బస్సులకు ఫిట్ నెస్ టెస్ట్ లు నిర్వహించాల్సి ఉంది. దీంతో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను తుక్కు గా మార్చేసి రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు తెలిపారు. ఇబ్రహీం పట్నం , షాద్ నగర్, కొండాపూర్ కార్యాలయాల్లో బస్సు డ్రైవర్లు, అటెండర్లకు రోడ్డు భద్రత, డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు.
తూతూ మంత్రంగా అవగాహన…..
బస్సుల ఫిట్ నెస్ విషయంలో కఠినంగా ఉంటా మని ఆర్టీఏ అధికారులు చెబుతున్నా ఫిట్ నెస్ టెస్ట్ ల తీరుపై విమర్శలొస్తున్నాయి.సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ బస్సు సామర్థ్ యాన్ని పరీక్షించాల్సి ఉండగా చాలా వరకు అసిస్టెం ట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లతోనే తనిఖీలు కానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా ప్రతి బస్సును మోటార్ వెహికిల్ ఇన్ స్పె్క్టర్లు నడిపి చూసి ఫిట్ నెస్ ధ్రువీకరణపత్రం అందించాలి. కానీ చాలా వరకు సిబ్బంది కొరత కారణంగా బస్సులను నామమాత్రంగా తనిఖీ చేస్ తూమమ అనిపిస్తున్నారు. డ్రైవర్ల కు మెడికల్ టెస్ట్ విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆటో, క్యా బ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్ విమర్శించారు. నిత్యం స్కూల్ బస్సులు, డ్రైవర్లపై నిఘా పెట్టాలని కోరారు.