న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీకి ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్–చిరాగ్ రెడీ అయ్యారు. మంగళవారం నుంచి జరిగే మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఇండియన్ ప్లేయర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. విమెన్స్‌లో సింధు.. ఎనుగుయెన్ తుయ్ లిన్హ్ (వియత్నాం)తో తలపడనుంది. గాయం నుంచి కోలుకుని మలేసియా ఓపెన్‌లో ఆడిన సింధు సెమీస్‌లోనే నిష్క్రమించింది.
మాళవిక బన్సోద్.. పాయ్ యు పో (చైనీస్‌తైపీ)తో పోరాటం మొదలుపెట్టనుంది. మెన్స్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్.. ఆయుష్ షెట్టి అమీతుమీ తేల్చుకోనున్నారు. ప్రణయ్.. లీ చుక్ యియు (హాంకాంగ్)తో, కిడాంబి శ్రీకాంత్.. లిన్ చున్ యి (చైనీస్‌తైపీ)తో తలపడనున్నారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ గత నాలుగు సీజన్లలో ఫైనల్ చేరారు. 2022లో మినహా మిగతా మూడుసార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. దాంతో మరోసారి టైటిల్‌పై కన్నేశారు.
