సింగరేణి ఎన్నికలపై ఫోకస్ పెట్టండి : కవిత

సింగరేణి ఎన్నికలపై ఫోకస్ పెట్టండి : కవిత

హైదరాబాద్, వెలుగు :  సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో  బీఆర్ఎస్ అనుబంధ సంస్థను గెలిపించాలని  టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. బుధవారం ఆమె హైదరాబాద్​లోని తన నివాసంలో కార్మిక సంఘం నాయకులతో సమావేశమై సింగరేణి ఎన్నికలపై చర్చించారు. సంస్థలో కారుణ్య నియామకాలను కేసీఆర్​ప్రభుత్వమే పునరుద్ధరించిందని గుర్తుచేశారు. వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 

సంస్థను లాభాల బాట పట్టించడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని వివరించారు. కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ను అన్ని ఏరియాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో టీబీజీకేఎస్​అధ్యక్షుడు బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్​ప్రెసిడెంట్​కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.