ఫోక్ సాంగ్స్ కోసం.. మ్యూజిక్ ఛానల్‌‌

ఫోక్ సాంగ్స్ కోసం.. మ్యూజిక్ ఛానల్‌‌

జానపద గీతాలకు ఇటీవల ప్రేక్షకుల నుండి చక్కని ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ సాంగ్స్‌‌ కోసం వోక్స్ బీట్జ్ పేరుతో ఓ మ్యూజిక్ ఛానల్‌‌ను లాంచ్ చేశారు.  దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాస్టర్, హేమంత్  మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌ చెప్పారు. ఛానల్ కో ఫౌండర్ ఉపేంద్ర రాచుపల్లి మాట్లాడుతూ ‘షేడ్స్ స్టూడియోస్ సహకారంతో నలుగురు ఫ్రెండ్స్ కలిసి మంచి కాన్సెప్ట్‌‌తో దీన్ని స్టార్ట్ చేశాం. 

దీని ద్వారా కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసే పాటలు చేస్తున్నా’ అన్నారు. షేడ్స్ స్టూడియోస్ డైరెక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ ‘మూడు వీడియో, మూడు ఆడియో పాటలను విడుదల చేశాం. పాటలన్నీ బాగా వచ్చాయి. ‘వయ్యారి’ పాటను పండు మాస్టర్, శ్వేతా నాయుడు జంటపై తీశాం. వంద పాటలు చేయాలనే ప్లాన్‌‌లో ఉన్నాం’ అన్నారు.