Kitchen Tips : పూరీ పిండిలో బొంబాయి రవ్వ ఎందుకు కలపాలి

 Kitchen Tips : పూరీ పిండిలో బొంబాయి రవ్వ ఎందుకు కలపాలి

వంట.. ఎంత టేస్ట్ గా ఉంటే అంత ఆరోగ్యం. అంతేకాదు.. కిటుకులు తెలిస్తే.. మరింత రుచిగా.. సుచిగా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ తో.. వంటింట్లోని వంటలను మరింత టేస్టీగా తయారు చేసుకునే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం...

  • గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోయి వాటిల్లోని సొన బయటికి వచ్చేస్తుంటుంది. అలా కాకూడదంటే ఎగ్స్ ఉడకబెట్టే ముందు చిటికెడు ఉప్పుతో పాటు ఒక టీ స్పూన్ నూనె వేయాలి.
  • ఏదైనా శ్నాక్ లేదా కూర డీప్ ఫ్రై చేసేముందు నూనెలో కొంచెం ఉప్పు వేయాలి. దీనివల్ల వంటకాలు నూనె ఎక్కువ పీల్చుకోవు.
  • చింతపండు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జిప్ లాక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో చేయాలి.
  • కుక్కర్లో పప్పు వండేటప్పుడు అందులో కొంచెం నూనె వేయాలి. అలాగే కుక్కర్ మూతకి లోపలి వైపు కూడా నూనె రాయాలి. దీనివల్ల పప్పు బయటికి పొంగదు.
  • బెండకాయలు తరిగేటప్పుడు కత్తికి జిగురు అంటుకోవద్దంటే నిమ్మకాయ చెక్కతో కత్తిని రుద్ది, న్యాప్ కిన్ తో   తుడవాలి. 
  • క్లాత్ లో కొన్నిబియ్యం మూటగట్టి కాఫీ పౌడర్ డబ్బాలో వేస్తే పౌడర్ గడ్డకట్టదు.
  •  ఉప్మారవ్వని బాగా వేగించి గాలి చొరబడని డబ్బాలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది
  • చక్కెరకి చీమలు పట్టకూడదంటే .. చక్కెరడబ్బాలో కొన్ని లవంగాలు వేయాలి. 
  •  రెండు కప్పుల గోధుమ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేస్తే క్రిస్పీగా వస్తాయి. బాగా పొంగుతాయి కూడా.

ALSO READ: Health Tip : అరటి పండ్లు తింటే వెంట్రుకలు గట్టిగా ఉంటాయా..!