న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల స్వల్పంగా పెరిగి 3.4 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా కొన్ని ఆహార వస్తువుల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 3.87 శాతంగా నమోదైంది. బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమోటా, క్యాలీఫ్లవర్ ధరలు పెరిగాయి.
ఉల్లి, బంగాళదుంప, వెల్లుల్లి, కందిపప్పు ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అత్యధికంగా 5.83 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఏపీలో 4.05 శాతం, మిజోరంలో అత్యల్పంగా 0.66 శాతం ఉంది.

