Chain Snatching: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన డెలివరీ బాయ్‌

Chain Snatching: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన డెలివరీ బాయ్‌

ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. నిందితున్ని నిజామాబాద్ కు చెందిన సయ్యద్ హమీద్ (24)గా గుర్తించారు. అతని నుంచి బంగారు గొలుసు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ‘ఐదేళ్ల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన హమీద్ సంతోష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జనవరి 23 సాయంత్రం హమీద్ లంగర్ హౌజ్‌లోని ఓ ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించాడు. బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమీద్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.