ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ సీరియస్

ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ సీరియస్
  • ఎస్ వోకు షోకాజ్ నోటీసులు, నలుగురు వంట మనుషులు సస్పెన్షన్

మొగుళ్లపల్లి,వెలుగు:  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికిశాల కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ అయ్యారు. స్కూల్ ఎస్ వో కు షోకాజ్ నోటీసులు ఇచ్చి,  నలుగురు వంట మనుషులను సస్పెండ్ చేశారు. సోమవారం స్కూల్ లో వంట మనుషులు పురుగులతో కూడిన బియ్యంతో కిచిడి వండి విద్యార్థినులకు పెట్టడడంతో ఫుడ్ పాయిజన్ అయి 20 మందికి పైగా వాంతులు విరోచనాలతో చిట్యాల ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలియడంతో మంగళవారం కలెక్టర్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లో కిచెన్, స్టోర్, పరిసరాలను పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్ఓ స్కూల్ టీచర్స్, సిబ్బంది, స్టూడెంట్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్కూల్ ఎస్ వో శైలజకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  వంట మనుషులు ఉమాదేవి, రజిత, సరిత, లక్ష్మిని సస్పెండ్ చేయాలని డీఈవోను ఆదేశించారు.   అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ..  స్టూడెంట్స్ సంక్షేమంలో టీచర్లు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించమన్నారు.  జిల్లాలోని 62 సంక్షేమ హాస్టల్స్ లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు, డీఈవో ఆఫీసులో 9949194492, 9000996933, 9441924901, కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచుతామని  పేర్కొన్నారు. అనంతరం స్టూడెంట్స్, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఆయన డీఈవో రాజేందర్, జిల్లా ఇన్ చార్జ్  హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో సురేందర్, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్ఐ అశోక్ ఉన్నారు.