హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

 హైదరాబాద్ చందానగర్ లోని  ఓ ప్రైవేట్  హాస్టల్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది.  50 మందికి  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

  జూన్ 23న ఆదివారం హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాల చేసుకున్నారు.  వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు హాస్టల్ యాజమాన్యం. 50 మందిలో ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.