పానీ పూరీతో ఫుడ్ పాయిజన్ .. జోగులాంబ గద్వాల జిల్లా లో15 మందికి అస్వస్థత

పానీ పూరీతో ఫుడ్ పాయిజన్ ..   జోగులాంబ గద్వాల జిల్లా లో15 మందికి అస్వస్థత

అయిజ, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ లో ఉన్న ఓ చాట్  భండార్ లో పానీ పూరి తిన్న 15 మంది మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో విద్యార్థులు ఉండడంతో పేరెంట్స్​ ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్లు షెక్షావలి ఆచారి, మద్దిలేటి తదితరులు ఆసుపత్రికి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటనపై ఆరా తీశారు.