హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో అక్కడక్కడా చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ఎస్టీ గురుకుల, ఈఎంఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ స్కూల్స్) ప్రిన్సిపాల్స్, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పని చేస్తున్న అధికారులకు ఒక రోజు ప్రత్యేక శిక్ష ణా కార్యక్రమం ‘ఎఫ్ఓఎస్ టీఏసీ(ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్)’ నిర్వహించ నున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జరగనున్న ఈ ట్రైనింగ్‌కు రాష్ట్రంలోని ఎస్టీ గురుకులాలు, ఈఎంఆర్ఎస్ పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్స్, స్టాఫ్ నర్సులు, హెల్త్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ అటెండ్ కానున్నారని అధికారులు తెలిపారు.
