Good Health: కాల్షియం ఫుడ్.. రాగులతో చేసిన ఆహారం.. షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో పోషకాలు..

Good Health:   కాల్షియం ఫుడ్.. రాగులతో చేసిన ఆహారం.. షుగర్ కంట్రోల్..  ఇంకా ఎన్నో పోషకాలు..

తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్ పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావ ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు. 

రాగులంటేకాల్షియం ఖజానాగా చెప్పవచ్చు.. ఈ ధాన్యం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే గట్టిగా ఉంటారు. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా రాగులు కంట్రోల్ చేస్తాయి. షుగర్ ను అదుపులో ఉంచుతాయి. 

ALSO READ : వర్షాకాలంలో నోరూరించే వేడివేడి "దాల్ వడ".. 

రాగుల్లోని అమైనో ఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెస్ట్రాల్​ ను రాగులు పోగొడతాయి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ని రాగులు చక్కగా కంట్రోల్ చేస్తాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్, అమినో యాసిడ్స్ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పిలాంటివి దరికి చేరవు.