సూపర్ ఆప్షన్ : రైళ్లో ప్రయాణిస్తూ.. ఎక్కడికక్కడ మీకు నచ్చిన ఫుడ్ జుమాటోలో ఆర్డర్ చేయొచ్చు

సూపర్ ఆప్షన్ : రైళ్లో ప్రయాణిస్తూ.. ఎక్కడికక్కడ మీకు నచ్చిన ఫుడ్ జుమాటోలో ఆర్డర్ చేయొచ్చు

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇకపై రైళ్లలో కూడా ఫుడ్ డెలివరీ చేస్తుందట. ఇందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తో ఒప్పందం చేసుకుంది. మొదటగా ఐదు రైల్వేస్టేషన్లలో ఫుడ్ డెలివరీ చేసేందుకు జొమాటో ఐఆర్సీటీసీ తో ఒప్పందం చేసుకుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఐదు  రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ చేయనుంది. మొదటగా IRCTC ఇ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణకులు భోజనాన్ని ఆర్డర్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 

ఆహారం విషయంలో ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్లను అందించడంలో భాగంగా జుమాటో తో ఐఆర్ సీటీసీ చేతులు కలిపింది. ఐఆర్ సీటీసీ ఈ క్యాటరింగ్ సేవల కింద ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. జుమాటో సాయంతో ఆయా స్టేషన్లలో ఫుడ్ ను అందజేస్తారు.  

జుమాటో IRCTC ఇ కేటరింగ్ పోర్టల్ ద్వారా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(PoC) ద్వారా ప్రీ ఆర్డర్ చేసిన భోజనాన్ని మొదటి దశలో రైల్వే ఐదు రైల్వే స్టేషన్లు  న్యూఢిల్లీ, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి రైల్వేస్టేషన్లలో సరఫరా, డెలివరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తో కంపెనీ టైఅప్ అయిన తర్వాత అక్టోబర్ 18న ఉదయం జుమాటో షేర్ 52 వారాల గరిష్టస్థాయి ధర రూ.115కి చేరుకుంది.