యూరప్ లో కబడ్డీ ప్రపంచ కప్

యూరప్ లో కబడ్డీ ప్రపంచ కప్

మొదటిసారిగా కబడ్డీ ప్రపంచ కప్ ఆసియా ఖండం బయట జరగబోతుంది. ఇంగ్లండ్ లోని వెస్ట్ మిడిల్ ల్యాండ్స్.. 2025లో జరగబోయే కబడ్డీ ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ తెలిపింది. ఈ నిర్ణయంవల్ల ఆసియా, యూకే దేశాల మధ్య వాణిజ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

కరోనా కారణంగా 2021లో ప్రపంచ కప్ నిర్వహించలేదు. ఆసియా దేశాలతో పోటీగా యూరోప్ దేశాల్లో ఇప్పుడు కబడ్డీ కూడా బాగా పాపులర్ అవుతోంది.  అయితే, 2025 వెస్ట్ ల్యాండ్ లో జరిగే పురుషులు, మహిళల ప్రపంచ కప్ కి ఈ సారి 50కి పైగా దేశాలు పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 10 కబడ్డీ ప్రపంచ కప్ ల్లో తొమ్మిది ఆసియాలోనే  జరిగాయి. అందులో  తొమ్మిది టైటిల్లను ఇండియా గెలుచుకోగా, ఒకటి పాకిస్తాన్ (2020) గెలుచుకుంది. ప్రో కబడ్డీ లీగ్ మొదలయ్యాక ప్రపంచ కబడ్డీ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రో కబడ్డి తరహాలో ఇప్పటికే బ్రిటిష్ కబడ్డీ లీగ్, వరల్డ్ కబడ్డీ లీగ్, సూపర్ కబడ్డీ లీగ్, ఇంగ్లండ్ కబడ్డీ లీగ్ లు విజయవంతంగా నడుస్తున్నాయి.