ఫారిన్ స్టూడెంట్స్‌‌ ఓటు కర్నాటక కే

ఫారిన్ స్టూడెంట్స్‌‌ ఓటు కర్నాటక కే
  • తొమ్మిదో ప్లేస్‌‌లో మన రాష్ట్రం
  • నేపాల్‌‌ నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్‌‌
  • బీటెక్‌‌ చదివేందుకే ఆసక్తి

 

మన దేశంలో హయ్యర్‌‌‌‌ స్టడీస్‌‌ కోసం నేపాల్‌‌ నుంచే ఎక్కువ మంది వస్తున్నారని హెచ్‌‌ఆర్‌‌‌‌డీ మినిస్ట్రీ చెప్పింది. ఆల్‌‌ ఇండియా సర్వే ఆఫ్‌‌ హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌ రిపోర్ట్‌‌ను మంగళవారం వెల్లడించింది.  ఆ రిపోర్ట్‌‌ ప్రకారం ఫారిన్‌‌ స్టూడెంట్స్‌‌ ఎక్కువ మంది కర్నాటకలో చదవడానికి ఇష్టపడుతున్నారు. ఫారెన్‌‌ స్టూడెంట్స్‌‌ను ఆకట్టుకోవడంలో మన రాష్ట్రం దేశంలోనే తొమ్మిదో ప్లేస్‌‌లో ఉంది. నేపాల్‌‌ తర్వాత ఆఫ్గనిస్తాన్‌‌ నుంచి ఎక్కువ మంది వస్తున్నారని, ఫారిన్‌‌ స్టూడెంట్స్‌‌ బీటెక్‌‌లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది. వారిలో ఆడవాళ్ల కంటే మగవారే ఎక్కువగా ఉన్నారు. హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌ కోసం ఇప్పటి వరకు 47,427 మంది ఎన్‌‌రోల్‌‌ చేసుకున్నారు. మొత్తం పది దేశాల నుంచి 63.7 శాతం మంది ఫారిన్‌‌ విద్యార్థులు ఉన్నారు.  పీహెచ్‌‌డీ చేసేందుకు ఇథియోపియా నుంచి ఎక్కువగా వస్తున్నారు. అండర్‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌ కోసం 73.4 శాతం మంది వస్తుండగా.. పోస్ట్‌‌ గ్రాడ్యుయేషన్‌‌ కోసం 16.15 శాతం మంది వస్తున్నారు.