మోత్కుపల్లి ప్రైవేట్ క్వారీలో రాక్ ఈగిల్ ను కాపాడిన వ్యక్తులకు సన్మానం

మోత్కుపల్లి ప్రైవేట్ క్వారీలో రాక్ ఈగిల్ ను కాపాడిన వ్యక్తులకు సన్మానం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి పనులను రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి. సువర్ణ ఆదివారం పరిశీలించారు. నగర్ వన్ యోజన పథకం కింద జిల్లాలో అప్పాయిపల్లి, జాఫర్​పల్లి, గొట్లపల్లి, అనంతగిరి, బొమ్మరాసిపేట వద్ద అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 

ఇటీవల మోత్కుపల్లిలోని ప్రైవేటు క్వారీలో రాక్ ఈగిల్​- ఔల్​ను గుర్తించిన వైల్డ్​లైఫ్ ఫొటోగ్రాఫర్ మనోజ్ విట్టేపు, క్వారీ పనులు నిలిపివేసి ఆ పక్షిని రక్షించిన క్వారీ యజమాని ఎన్. లక్ష్మారెడ్డిని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.  ఆమె వెంట కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి జి. జ్ఞానేశ్వర్, వికారాబాద్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.