సాగు భూముల్లోకి పోకుండా ఆఫీసర్లు అడ్డుకుంటున్రు..మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన

సాగు భూముల్లోకి పోకుండా ఆఫీసర్లు అడ్డుకుంటున్రు..మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన

శివ్వంపేట, వెలుగు: ఫారెస్ట్​ ఆఫీసర్లు వేధిస్తున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్ల తండాకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ​ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడేమో ఫారెస్ట్​ ఆఫీసర్లు కబ్జా చేశామని కేసులు పెడుతున్నారని వాపోయారు. సాగు భూముల్లోకి తమను రావద్దని అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.