విజయవాడలో భారీ కొండచిలువ

విజయవాడలో భారీ కొండచిలువ

విజయవాడలో భారీ కొండ చిలువ పట్టుబడింది. ఏలూరు లాకులు వద్ద ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. భారీ పైతాన్ ను చూసి స్థానికులు భయపడ్డారు. అయితే.. ఇంత పెద్ద కొండ చిలువ ఎలా వచ్చిందని ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాల్వలోని నీటి  ప్రవాహానికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

వచ్చే నాగులు చవితిని పురస్కరించుకుని.. కాలువ వెంబడి ఉన్న పుట్టలపై పిచ్చి మొక్కలను కూలీలు తొలగిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద పాము కనపడడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. దీంతో ఇరిగేషన్ ఏఈఈ అంజుమన్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడ చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు చాలా శ్రమించారు. కాల్వగట్టుపై ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.