140 మిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు

140 మిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు

ముంబై :  మనదేశ ఫారెక్స్​ నిల్వలు ఈ ఏడాది మార్చి 22తో ముగిసిన వారంలో 140 మిలియన్ డాలర్లు పెరిగి 642.631 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్​ బ్యాంక్ తెలిపింది.  మొత్తం నిల్వలు పెరగడం ఇది వరుసగా ఐదో వారం. మునుపటి  వారంలో నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు పెరిగి  642.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబరు 2021లో విదేశీ మారక నిల్వలు  642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పుడు మునుపటి గరిష్ట స్థాయి నమోదైంది. 

గత సంవత్సరం నుండి ప్రధానంగా ప్రపంచ పరిణామాల కారణంగా ఏర్పడిన ఒత్తిళ్ల మధ్య రూపాయిని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ డాలర్లను అమ్మడంతో నిల్వలు దెబ్బతిన్నాయి. మార్చి 22తో ముగిసిన వారానికి, విదేశీ కరెన్సీ ఆస్తులు 123 మిలియన్ డాలర్లు తగ్గి  568.264 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  బంగారం నిల్వలు 347 మిలియన్‌‌‌‌ డాలర్లు పెరిగి 51.487 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్​బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్  57 మిలియన్ డాలర్లు తగ్గి  18.219 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని   బ్యాంక్ వెల్లడించింది.