
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 23 సంఘాలతో మరో టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. టీజేఏసీ చైర్మన్ గా మణిపాల్ రెడ్డి (టీటీయూ), జనరల్ సెక్రటరీగా పర్వతి సత్యనారాయణ (పీఆర్టీయూటీ), డిప్యూటీ చైర్మన్ గా చింతకుటం జగదీశ్ (ఆర్‌యూపీపీ) ఎన్నికయ్యారు. టీఎన్ జీవో ఆఫీసులో పలు టీచర్ల సంఘాలు సమావేశమై, జేఏసీగా ఏర్పడ్డాయి.
టీజేఏసీ ట్రెజరర్‌గా మురళీకృష్ణ(జీహెచ్ఎంఎస్), కో చైర్మన్లుగా చందూరి రాజిరెడ్డి (టీఎస్టీయూ), భూతం యాకమల్లు (టీఎంఎస్ టీఏ), గోవింద్ నాయక్ (టీజీయూఎస్), రఘునందన్ రెడ్డి (టీయూటీఎఫ్), సీహెచ్ శ్రీనివాస్ (ఎస్‌ఎల్‌టీఏ), సాంబలక్ష్మి(టీఆర్డీసీఈఏ) తదితరులు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా కటకం రమేశ్ (టీఆర్టీయూ), సత్యనారాయణ(ఎస్ఎస్టీయూఎస్), యూదగిరి(బీటీఎస్), లక్ష్మణ్(టీటీయూఎస్), రామదాస్(ఎస్ జీటీఫోరం), రిషికేష్, వెంకన్న ఎంపికయ్యారు.