
బషీర్బాగ్, వెలుగు: ఉమ్మడి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ అదనపు డీజీపీ పి.వెంకయ్య (89) శనివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని ఇంట్లో కన్నుమూశారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన వెంకయ్య 1963 ఐపీఎస్బ్యాచ్ కు చెందినవారు.
పలు జిల్లాలకు ఎస్పీగా పనిచేసి మంచి పేరు సాధించారు. విశాఖపట్నంలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లా ఏర్పడడానికి ఆయనే కారణం. ఆ జిల్లాకు మొదటి ఎస్పీగా కూడా ఆయనే పనిచేశారు. ఆయనకు భార్య ఇందిరాదేవి.
ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. డీజీపీ శశిధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ లు కొప్పుల రాజు, ఎ.విద్యాసాగర్, జస్టిస్ఎం.ఎన్.రావు, రిటైర్డ్ జిల్లా జడ్జి విజయలక్ష్మి, డా.బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గనుమల జ్ఞానేశ్వర్ వెంకయ్య మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పిల్లలు విదేశాల్లో ఉన్నందున మంగళవారం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.