తెలంగాణ సీఎం ఓఎస్డీ పేరుతో డబ్బులు డిమాండ్..ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

తెలంగాణ సీఎం ఓఎస్డీ పేరుతో డబ్బులు డిమాండ్..ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్ సెక్రటరీనని నమ్మిస్తూ పలువురు బడా వ్యాపారవేత్తల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్​ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన బుదుమూరు నాగరాజు (32) గతంలో ఏపీ రంజీ టీమ్ కు ఆడాడు. ప్రముఖుల పేర్లను  వాడుకుని  ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు.  సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీని అంటూ ఫేక్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి పలువురు వ్యాపారులకు మెయిల్స్ పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు.  

.సీఎంఓ అధికారులకు తెలియడంతో  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసి నాగరాజుపై నిఘా పెట్టారు.  గురువారం శ్రీకాకుళంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. 2020లో ఇదే తరహాలో ప్రముఖుల పేరిట బెదిరింపులకు పాల్పడిన కేసులో నాగరాజుపై నాంపల్లి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. దీంతో పాటు తెలంగాణలో 13 , 16 కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.  నిందితుడి మొబైల్ ఫోన్   సీజ్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు  తెలిపారు.