ఈ తరం మేటి క్రికెటర్ కోహ్లీ

ఈ తరం మేటి క్రికెటర్ కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ లాంటి క్రికెటర్..ఈ తరం మేటి క్రికెటర్ అని ఆకాశానికెత్తాడు. తాను కోహ్లీకి ఫ్యాన్ అని తెలిపాడు. కోహ్లీ..వరల్డ్ క్రికెట్లోని బెస్ట్ క్రికెటర్ అని మెచ్చుకున్నాడు. కోహ్లీ గొప్ప అథ్లెట్ అని..అది అతని ఫిట్ నెస్ చూస్తే అర్థమవుతుందన్నాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకు వచ్చిన బ్రెట్ లీ.. మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు. 

ప్రతీసారి సెంచరీ ఆశించొద్దు..
విరాట్ కోహ్లీ రన్ మెషీన్ అని బ్రెట్ లీ అన్నాడు. అయితే ఎంత రన్ మెషీన్ అయినా..అతని నుంచి ప్రతీసారి సెంచరీ ఆశించడం సరైంది కాదన్నాడు. కోహ్లీ శతకం బాదాలని అనుకోవడం వల్ల అతనిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నాడు. అందుకే అతను వెయ్యిరోజుల వరకు సెంచరీ చేయలేదన్నాడు. 

క్రికెట్ ఆణిముత్యాలు..
క్రికెట్‌కు కోహ్లి కోహీనూర్‌ అని బ్రెట్ లీ కొనియాడాడు. అతను  ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అని మెచ్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్వెస్ కలీస్ దిగ్గజ క్రికెటర్లన్నాడు. వారి ఆటను చూసే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. వారితో కలిసి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.