ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్  కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్  కన్నుమూత

దిగ్గ‌జ క్రికెట‌ర్‌.. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కన్నుమూశారు. ఆయన వయసు  74 ఏళ్లు. క్వీన్స్‌ లాండ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మార్ష్‌కు గుండె పోటు వ‌చ్చింది. దీంతో వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రాడ్ మార్ష్ ఇవాళ(శుక్రవారం)తుది శ్వాస విడిచారు.  మార్ష్ చనిపోవడంపై పలువురు క్రీడాకారులు నివాళులు అర్పిస్తున్నారు.

ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్‌లో మార్ష్ ఒక‌రు. 1970 నుంచి 1984 మ‌ధ్య కాలంలో ఇంటర్నేషనల్  క్రికెట్‌లో మార్ష్ ఆడారు. కెరీర్‌లో రాడ్ మార్ష్ 96 టెస్టు మ్యాచ్‌లు, 92 వ‌న్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ క్ర‌మంలో అనేక రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్