మీరు ఓడిపోవటం ఏంటయ్యా .. బోరు బోరున ఏడ్చిన ఫైళ్ల శేఖర్ రెడ్డి అనుచరులు

మీరు ఓడిపోవటం ఏంటయ్యా ..  బోరు బోరున ఏడ్చిన ఫైళ్ల శేఖర్ రెడ్డి అనుచరులు

భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిపై ఓటమి పాలైన ఆయన ఇవాళ  భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో  మీడియాతో  మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు  ఏడ్చారు. మీరు ఓడిపోవడం ఏంటయ్యా అంటూ బోరున ఏడ్చారు.  

ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశానని.. పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు  శేఖర్ రెడ్డి. ప్రజలు  రెండు సార్లు అవకాశం ఇచ్చారని... ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమలు ఇంటింటికీ తీసుకు వెళ్లానని తెలిపారు.  ప్రజలు మార్పు కోరుకున్నారని...  ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు.  ట్రిపుల్ విషయంతో తనకు సంబంధం లేదని.. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని క్యాష్ చేసుకున్నాయని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ..ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. అనిల్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన భువనగిరి లో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లలో విజయం సాధించగా.. బీఆర్ఎస్ 39 సీట్లు, బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే